ఆధార్ కార్డు ఉంటే 10 రోజుల్లో పాస్‌పోర్ట్..!


ఆధార్ కార్డు ఉన్న వారికి శుభవార్త. ఆధార్ కార్డు ఉన్నవారు 10 రోజుల్లో పాస్పోర్ట్ పొందే అవకాశాన్ని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కల్పిస్తోంది. ఇందుకోసం ఆధార్ కార్డు సమాచారాన్ని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరోతో అనుసంధానం చేయనున్నారు. ఇలా చేయడం వల్ల దరఖాస్తుదారుని(ఆమె/అతడు) గత నేర చరిత్ర ధ్రువీకరణ కోసం గుర్తింపుగా ఆధార్ కార్డును వినియోగించనున్నట్లు శాఖ అధికారి తెలిపారు. కొత్త, తత్కాల్ పాస్పోర్టులకు దరఖాస్తు చేసుకున్న దరఖాస్తుదారుని పౌరసత్వం, నేర పూర్వాపరాలు, నేరారోపణలను లాంటి వాటిని పోలీసు తర్వాత ధృవీకరించనున్నారు. ప్రస్తుతం పాస్ పోర్టుల జారీ విషయంలో పోలీసు ధృవీకరణ ఆలస్యం అవతుండటంతో కేంద్రం నిర్ణయం తీసుకుంది.
తాజా ఫార్మెట్లో దరఖాస్తుదారు ఆన్ లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది. గుర్తింపు మరియు చిరునామా కింద ఆధార్ కార్డు తప్పనిసరి. దరఖాస్తు చేసుకున్న మూడు రోజుల్లో దరఖాస్తుదారు అపాయింట్మెంట్ పొందుతారు. మరొక ఏడు రోజుల్లో, పాస్ పోర్ట్ని ప్రాసెస్ చేసి ఇంటికి పంపడం జరుగుతుంది. తర్వాత పోలీసు ధృవీకరణ కోసం ఇంటికి వస్తారు. పాస్ పోర్టు జారీల విషయంలో జరుగుతున్న ఆలస్యాన్ని అధిగమించడానికి ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం, ఇంటిలిజెన్స్ బ్యూరో విభాగంతో పాటు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధార్ కార్డుని తప్పనిసరి చేసింది. దీనిని అమలు చేసేందుకు యుఐడిఎఐతో విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సమన్వయం చేసుకుంటుంది.

0/Post a Comment/Comments

Previous Post Next Post