Social Network- Facebook creates History

హైదరాబాద్‌:ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ఆదరణ పొందుతున్న సోషల్‌ నెట్‌వర్కింగ్‌ సైట్‌ ఫేస్‌బుక్‌ తాజాగా మరో రికార్డును సొంతం చేసుకుంది. ఆగష్టు 24వ తేదీన ఒక్కరోజే ఫేస్‌బుక్‌లో బిలియన్‌ మంది లాగిన్‌ అయ్యారు. ఈ విషయాన్ని ఫేస్‌బుక్‌ సీఈఓ జుకెన్‌బర్గ్ వెల్లడించారు.
ప్రపంచంలో ఉన్న ప్రతి 7 మందిలో ఒకరు ఆ రోజు ఫేస్‌బుక్‌ వాడి తమ సన్నిహితులతో, కుటుంబ సభ్యులతోనో ఫేస్‌బుక్‌ ద్వారా కనెక్ట్ అయ్యారని జుకెన్‌బర్గ్ తెలిపారు. ప్రపంచంలో ప్రతి ఒక్కరికీ ఇంటర్‌నెట్‌ అందుబాటులో ఉంచాలనే తమ లక్ష్యానికి ఇది తొలి అడుగని జుకెన్‌బర్గ్ అన్నారు. 2012 అక్టోబర్‌లోనే బిలియన్‌ మార్క్ చేరుకున్న ఫేస్‌బుక్‌ ప్రస్తుతం ఒకటిన్నర బిలియన్‌ యూజర్లకు సేవలందిస్తోంది.
Source: Ap Updates

Post a Comment

Previous Post Next Post