Nenu Sailaja Movie review in Telugu

కొత్త ఏడాదిన కొత్త మార్పులతో మంచి జరగాలని ఎవరు మాత్రం కోరుకోరు...? నేడు విడుదలైన 'నేను శైలజ'సినిమాపై దర్శకుడు కిషోర్ తిరుమల (2nd Film), హీరోగా వరుస పరాజయాలను ఎదుర్కొంటున్న రామ్ కూడా అలాంటి ఆశలతోనే ఉన్నారు. మరి వారి ఆశలు ఫలించాయా లేక అడియాసలయ్యాయా అన్నది చూసే ముందు శైలజ కథేంటో లుక్కేద్దాం.

The Story: శైలజ (కీర్తి సురేష్) చిన్ననాటి నుండి అన్నయ్య (ప్రిన్స్), అమ్మ (రోహిణి)తో కలిసి ఉంటుంది. Wealth ఉంటేనే సంతోషం అనుకునే వాళ్ళ నాన్న (సత్యరాజ్) కుటుంబానికి దూరంగా ఉంటూ ఆర్థిక అవసరాల్ని తీరుస్తూ ఉంటాడు. దాంతో తండ్రి ప్రేమకు దూరంగా ఉన్నామన్న దిగులుతోనే పెరుగుతుంది శైలజ. ఇక Hari (Ram) విషయానికొస్తే అతనో డీజే. నచ్చిన అమ్మాయికి 'I L U' చెప్పడానికి అస్సలు ఆలోచించడు. అమ్మాయిలు కూడా అంతే సూటిగా నో అనటంతో ఇక తన జీవితంలో ప్రేమకి స్థానం లేదు అని ఫిక్స్ అవుతాడు. అలాంటి సమయంలోనే ఎదురుపడుతుంది శైలజ. హరి తన ఒట్టు గట్టు మీద పెట్టేసి శైలజతో ప్రేమాయణం నడిపాడా..? శైలజ తండ్రి కుటుంబం కన్నా కరెన్సీకె ప్రాధాన్యం ఇవ్వటానికి గల కారణమేంటి అన్నది తెరపై చూడల్సిన కథ. 

Starring: Hari పాత్రలో Ram హుషారుగా కనిపించి మెప్పిస్తాడు. హీరోయిన్ కీర్తి సురేష్ చాలా వరకు ఒకే ఎక్స్ప్రె షన్కి పరిమితం. సత్యరాజ్, ప్రిన్స్, శ్రీముఖి, నరేష్ ప్రగతి తమ పాత్రల మేరకు పరిశ్రమించారు.

Technical section: సినిమాకి పాటలు దన్నుగా నిలిచాయి. ఇటు సాహిత్యపరంగానూ అటు దేవి శ్రీ ప్రసాద్ బాణీలు కలిసొచ్చాయి. నేపథ్య సంగీతం ఫర్వాలేదు. సమీర్ కెమెరాలో వైజాగ్, పొల్లాచ్చి లోకేషన్స్ అందంగా కనపడతాయి.

By - Analysis : దర్శకుడు స్వతహాగా రచయిత కావడంతో పదును చూపించాడు. ప్రేమ విఫలమైన కుర్రాడికి 'అమ్మాయిలు గుడి కడితే రారు. పబ్ అయితే వీకెండ్లోనైనా వచ్చి పోతారు' అని ట్రెండీగా రాసిన కిషోర్ 'అమ్మాయి పెళ్ళయ్యాక తండ్రిని వదిలేయాలని ఎవడు నిర్ణయించాడో గానీ వాడు ఖచ్చితంగా కూతురు కనుండడు' లాంటి మాటలను తండ్రి పాత్రతో చెప్పించి రచయితగా మాగ్జిమం మార్క్స్ రాబట్టుకున్నాడు. ఇక దర్శకుడిగానూ మొదటి భాగంలో సన్నివేశాలను కొత్తగా చూపించాడు. అయితే దాన్ని ద్వితీయార్థంలో కంటిన్యూ చెయ్యలేకపోయాడు. సన్నివేశాలు బాగానే ఉన్నప్పటికీ కనెక్టివిటీ సమస్య ప్రధానంగా కనపడుతుంది. ఒకదాని వెనక ఒకటి క్యూ కట్టినట్టు అనిపిస్తాయి. పాత్రల కూర్పులోనూ స్పష్టత కొరవడింది. కేవలం ఒక పాట కోసమే హీరోని డీజేగా చూపించారు. హీరో ఫ్రెండ్ (సుడిగాలి సుధీర్) హీరోయిన్ పరిచయమవగానే మాయమైపోతాడు. పాత్రని రౌడీ (ప్రదీప్ రావత్)తో పూడ్చాలనుకున్నాడు. అదీ అంతంత మాత్రంగానే మిగిలిపోయింది. అన్నిటినీ మించి శైలజ తండ్రికి వాళ్ళ నాన్నతో తగాదా, దాని వల్ల శైలజ ఎదుర్కొన్న సమస్యలను చెప్పటానికి డ్రామాని వదిలి మాటల మీదే ఆధారపడటం పెద్ద మైనస్. ప్రిన్స్, శ్రీముఖిల లవ్ స్టొరీకి ముగింపు లేదు.

0/Post a Comment/Comments

Previous Post Next Post